కథలు


Content

పరిచయం

దొండపాటి కృష్ణ
          రచయిత దొండపాటి కృష్ణ 24 నవంబర్ 1989న కొత్త రేమల్లె గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ లో దొండపాటి గోవర్ధన రావు, రంగమ్మ దంపతులకు జన్మించారు. సంస్కృతి సంప్రదాయం కలగలిపిన కుటుంబంలో జన్మించిన రచయితకు మొదట్లో ఏవేవో ఆలోచనలు చుట్టిముట్టినా చివరకు కవిత్వం వెంట పరుగులు తీయడం మొదలెట్టారు. వంశపారపర్యంగా ఉన్న కారణం చేత కవిత్వం రాయడం త్వరగానే అలవడింది.

         రచయిత తన గ్రాడ్యుషన్ చదువుతున్న రోజులనుంచి తన ఆలోచనా సరళిని పెంచుకోవడం మొదలెట్టారు. అటువంటి తరుణంలో తనని అమితంగా ఆకట్టుకున్న అంశాలు రెండు. మొదటిది తన తెలుగు అధ్యాపకులు శ్రీ. గంగాధర రావు గారు జైపూర్ కృత్రిమ కాలుతో తరగతికొచ్చి తెలుగు పాఠాలను ఆస్వాదిస్తూ బోధించడం. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న రోజుల్లో కూడా ఆయనలా సంతోషంగా పాఠాలను బోధించడం రచయితను కదిలించింది.
శ్రీ. గంగాధర రావు
          రెండవది సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు, ఒక పాటల వేడుకలో తను రాసిన పాట గురించి వివరిస్తూ, దిగజారిపోతున్న తెలుగు భాష మరియు సాహిత్యం గురించి పడిన మనోవేదన రచయిత గుండెలకు తాకింది. సహజసిద్ధంగా నిర్మించబడిన సంస్కృతి సంప్రదాయాలు పడిపోతున్న తరుణంలో గంజాయి తోటలో తులసి మొక్కల్లా కవులు, ప్రబోధకులు దానిని నిలబెట్టడానికి చేస్తున్న కృషికి ఉడత సాయమైనా చేయాలన్న తలంపు నుండి ప్రభవించినవే రచయిత ఆలోచనలు. ఈ రెండు సంగతులు మాతృభాష కోసం ఏదైనా చేయాలని పరితపించేలా చేశాయి. ఆ తపనలు కవిత్వంవైపు మనస్సును మళ్ళించాయి. 2007వ సంవత్సరం మొదలు అడుగులతో మొదలైనా కవిత్వం నేడు పరుగులందుకోవడంలోనూ ముందుంది. అడుగుల కవిత్వం పరుగులుగా మారడానికి ముఖ్య వ్యక్తి, మార్గ దర్శకుడు అయిన రచయిత గురువు గారు పూజ్యులు శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (C.S) గారు.
శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (C.S
         రచయిత తన పోస్ట్ గ్రాడ్యుషన్ ను 2010 – 13 కాకినాడ JNTU లో చదువుతున్న రోజుల్లో అక్కడ స్నేహితుని ద్వార C.S గారితో పరిచయం ఏర్పరుచుకున్నారు. నెలకు ఒకటో రెండో కవితలు రాసే రచయిత ఆయన శిష్యరికంలో నేడు నెలకు 5 కవితలను రాసే స్థాయికి ఎదిగారు. చిన్న చిన్నగా అక్కడక్కడే పరిభ్రమించే రచయిత ఆలోచనలు C.S గారి సాంగత్యంలో ప్రపంచాన్ని చూడడం ప్రారంభించాయి. ప్రతి సమస్యను తన సమస్యగా ఊహించుకునేలా చేశాయి. ఒక సందర్భాన్ని లేదా సమస్యను కవిత్వంగా ఎలా మలచాలో C.S గారు వర్ణించిన తీరు వర్ణనాతీతం. ఆయనకేలా కృతఙ్ఞతలు తెలపాలో తెలియక రచయిత చేస్తున్న ప్రయత్నమే ఈ వెబ్ సైట్.

          రచయిత చేస్తున్న ఈ వెబ్ సైట్ ప్రయత్నం మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. మీరు మీ కామెంట్స్ ను క్రింది బాక్స్ నుండి పంపించగలరు. రచయితకు ప్రత్యక్షంగా సాయం చేసిన C.S గారికి మరియు పరోక్షంగా సాయం చేసిన మిగిలిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 

Thanks for your time.